ఎన్నికల్లో మీడియా పాత్ర అత్యంత కీలకమైనది
నగర కమిషనర్ ప్రవీణ్ చంద్,
ఎన్నికల నియమావళి పై జర్నలిస్టులకు శిక్షణ కార్యక్రమం
కడప, మార్చి 5 : రానున్న సాధారణ, పార్లమెంట్ ఎన్నికల్లో పాత్రికేయులు ప్రజలకు సరైన సమాచారాన్ని అందించడంలో అత్యంత కీలక పాత్ర పోషించాలని నగర కమిషనర్ ప్రవీణ్ చంద్ పేర్కొన్నారు.
మంగళవారం కలెక్టరేట్ లోని స్పందన హాలులో త్వరలో జరగనున్న సాధారణ, ఎన్నికల సందర్భంగా ఎంసిఎంసి,మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్, ఎన్నికల్లో మీడియా పోషించాల్సిన పాత్ర పై ఎంసిఎంసి మెంబర్ గుర్రప్ప పవర్ పాయింట్ ప్రజెంటషన్ ద్వారా పాత్రికేయులకు అవగాహన కల్పించారు.
ఈ శిక్షణా కార్యక్రమానికి నగర కమిషనర్ ప్రవీణ్ చంద్ ముఖ్య అతిధి గా హాజరు కాగా ఆయన తో పాటు అసిస్టెంట్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్, డిఆర్వో గంగాధర్ గౌడ్, సమాచార పౌర సంబంధాల శాఖ అధికారి మరియు ఎంసింసి మెంబర్ సెక్రటరీ వేణుగోపాల్ రెడ్డి లు హాజరయ్యారు.
ఈ సందర్భంగా నగర కమిషనర్ ప్రవీణ్ చంద్ మాట్లాడుతూ .. రానున్న సార్వత్రిక ఎన్నికలు ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య ఎన్నికలని ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని తెలిపారు. ఎన్నికల్లో ఓటర్లను చైతన్యపరచడంలో మీడియా కీలక పాత్ర పోషించాలని సూచించారు. ఎన్నికల అబ్జర్వర్స్ ఎక్స్పెండిచర్ అబ్జర్వర్డ్స్ లాగానే మీడియా కూడా ఎన్నికల్లో ముఖ్య పాత్ర పోషిస్తుందని అన్నారు. ఎన్నికల నియమ నిబంధనలను పాటించేలా మీడియా ఆక్టివ్ రోల్ పోషించాలన్నారు. ఎన్నికల్లో ప్రజలు పారదర్శకంగా స్వేచ్ఛాయిత వాతావరణంలో ఓటు వేయడానికి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సహకరించాలన్నారు. ఏదైనా వార్తను ప్రచురించే ముందు ఫ్యాక్ట్ చెక్ సరిచూసుకొని ప్రచురించాలని పాత్రికేయులను కోరారు. ఫేక్ న్యూస్ లను స్ప్రెడ్ కాకుండా మీడియా ముఖ్య భూమిక పోషించాలన్నారు ఎన్నికలకు సంబంధించిన అధికారిక సమాచారాన్ని ఐ అండ్ పి ఆర్ ద్వారా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాకు తెలియజేస్తామన్నారు. ప్రభుత్వం ప్రచారం చేస్తున్న స్వీప్ ఆక్టివిటీస్ ను ప్రజలకు చేరవేయడంలో,చైతన్య పరచడంలో జర్నలిస్టులు సహకరించాలని కోరారు.
వార్తా కథనాలు ప్రచురించే ముందు వాస్తవాన్ని తెలుసుకొని ప్రచురించాలని తెలిపారు.రాజకీయ ప్రకటనలు సోషల్ మీడియా, బల్క్ ఎస్ఎంఎస్లు, వాయిస్ మెసేజ్ లు, సినిమా హాల్లో ప్రకటనలు, ఈ పేపర్లు ,రేడియో లలో ముందుగా ఎంసి ఎంసి ద్వారా సర్టిఫై అయిన తర్వాతనే ప్రచురించాలన్నారు.MCMCలు క్రింది మూడు ప్రధాన విధులను కలిగి ఉన్నాయన్నారు.
- సోషల్ మీడియాతో సహా ఎలక్ట్రానిక్ మీడియాలో రాజకీయ ప్రకటనల ముందస్తు ధృవీకరణ.2. చెల్లింపు వార్తల కేసులపై పర్యవేక్షణ మరియు చర్యలు. 3. ఎన్నికల సమయంలో మీడియా ఉల్లంఘన కేసులను పర్యవేక్షిస్తుందన్నారు.అలాగే ఇతర దేశాలపై విమర్శలు; మతాలు లేదా సంఘాలపై దాడి;
అసభ్యకరమైన లేదా పరువు నష్టం కలిగించే ఏదైనా; హింసను ప్రేరేపించడం;
కోర్టు ధిక్కారానికి సంబంధించిన ఏదైనా;
ప్రెసిడెంట్ మరియు న్యాయవ్యవస్థ యొక్క సమగ్రతను వ్యతిరేకించడం;దేశం యొక్క ఐక్యత, సార్వభౌమత్వం మరియు సమగ్రతను ప్రభావితం చేసే ఏదైనా;
ఏదైనా వ్యక్తి పేరుతో ఏదైనా విమర్శలు; లాంటివి ప్రచురించరాదన్నారు.
ఈ కార్యక్రమంలో డివిజనల్ పి ఆర్ ఓ మస్తాన్, డివిజనల్ పిఆర్ఓ సునీల్ సాగర్, కలెక్టరేట్ హెచ్ సెక్షన్ సిబ్బంది, పాత్రికేయులు, తదితరులు హాజరయ్యారు.
——–///——–
డిఐపిఆర్ఓ, స.పౌ.సం. శాఖ., వైఎస్ఆర్ జిల్లా.