నంద్యాల జిల్లా కోయిలకుంట్ల మండలంలోని గొల్లదుర్తి గ్రామంలో సెనగ పంట పొలంబడి కార్యక్రమం నిర్వహించడం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా సెనగ పంటలో విత్తన శుద్ధి ఎరువుల, యాజమాన్యం శనగ పంటలో పురుగులు తెగులు నివారణ గురించి వివరించడం అయినది .
ఈ కార్యక్రమంలో భాగంగా గ్రామంలోని శనగపంటను పరిశీలించడం అయినది. శనగ పంటలు అక్కడక్కడ ఏండు తెగులు ఆశించడం గమనించడమైనది .శనగ పంటలో ముఖ్యంగా ఎండు తెగులు, మోదల కుళ్ళు తెగులు ,వేరుకుల్లు తెగులు ఆకుమాడు, తుప్పు తెగులు ,బూజు తెగులు,ఆశించే అవకాశం ఉన్నది .అలాగే శనగపచ్చ పురుగు ,పచ్చ రబ్బరుపురుగు ఆశించే అవకాశం ఉన్నది .
Also Read ..YABER PRO V9 WiFi 6 Bluetooth Projector
ఎక్కడైతే ఏండు తెగులు, మొదలుకుళ్ళు తెగులు ఆశించినదో, ఆ ప్రదేశంలో భావిష్టిన్ పౌడర్ గాని ,కాపరాక్సీ క్లోరైడ్ గాని నీటిలో కలిపి తెగులు సోకిన ప్రదేశంలో మొక్కల చుట్టూ పోయాలని సూచించారు. అలాగే పురుగుమందుతోపాటు హెక్సా కొనజోలుగాని , ప్రొపి కొలజోల్ లాంటి శిలీంద్రపు మందులు తెగులు ఆసించకుండా కలిపి స్ప్రే చేయాలన్నారు .
అని ఈ కార్యక్రమంలో వివరించడమైనది. ఇందులో గ్రామ వ్యవసాయ సహాయకులు వ్యవసాయ విస్తరణ అధికారి రైతు సోదరులు పాల్గొన్నారని కోయిలకుంట్ల మండల వ్యవసాయ సహాయ సంచాలకులు నిరంజన్ తెలిపారు.
Aslo Read.. నల్లమల అడవులకు గజ రాజులు
*మొక్క జొన్న పంట లో “కత్తెర పురుగు” ఆశించి నష్టం కలుగ జేస్తున్నట్లు గమనించడం జరిగినది. కత్తెర పురుగు నివారణకు గాను:
I. విత్తు సమయంలో:
- లింగాకర్షక బుట్టలను ఎకరానికి 10 చొప్పున అమర్చాలి.
- మొక్కజొన్న పంటలో అంతర పంటగా అపరాలను సాగు చేసుకోవాలి.
1.విత్తినప్పటి నుండి 25 రోజుల వరకు:
- గుడ్ల సముదాయాన్ని ఏరి నాశనం చేయాలి.
ఎకరానికి వేప నూనె10000 పీ.పి.యం.: 400 మి.లీ./200 లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి.
- విత్తిన 25 రోజు నుండి 40రోజుల వరకు:
కత్తెర పురుగు లార్వాలను నివారిరించడానికి
- 5-20% ఆకులు దెబ్బతింటే, పురుగు మందులు ఎకరానికి ఎమామెక్టిన్ బెంజోయేట్,,@ 80 గ్రా
లేదా రైనాక్సిఫైర్ @ 100 మి.లీ./ఏకరానికి, లేదా
స్పైనోటరామ్ @ 100మి.లీ. /ఏకరానికి పిచి కారి చేసు కోవాలని రైతులకు సూచించడం జరిగినది.
- విత్తిన 40రోజు నుండి 60రోజుల లోపు:
ఈ దశలో యాజమాన్యం చాలా ముఖ్యమైనది. పురుగు ఆశించిన పంటలో క్రింద తెలిపిన మందులలో ఏదైనా ఒకదానిని పిచికారి చేయాలి.
ఎకరాకు:
1) స్పైనోసాడ్ – 70మి.లీ/ఏకరానికి
2) రైనాక్సిపైర్ – 80మి.లీ/ఏకరానికి
3) స్పైనోటరామ్ 100 మి.లీ./ఏకరానికి
4) ఎమామెక్టిన్ బెంజోయేట్ – 80 గ్రా.ఏకరానికి
5) థయేమిథాక్సామ్ + లామ్డా సైహలోత్రిన్ @ 100 మి.లీ./ఏకరానికి పిచికారి చేసు కోవాలని రైతులకు తెలియజేయడం జరిగినది.
ఈ సూచనలను రైతులకు “రైతు సేవ కేంద్రాల” ద్వార తెలియ చేయాలని డాక్టర్ ఏ రామకృష్ణారావు, మండల వ్యవసాయ అధికారిని మరియు ఏ.డీ.ఏ. ని కోరారు