శ్రీశైలంలో అర్ధరాత్రి చిరుత సంచారం
శ్రీశైలం :డిసెంబర్ 15
శ్రీశైలంలో మరోసారి చిరుత సంచారం కలకలం రేపింది. శ్రీశైలం జలాశయం సమీపం లో శనివారం అర్ధరాత్రి రోడ్డు పక్కన గోడపై కూర్చొని చిరుత కనిపించింది. అటువైపుగా వెళ్తున్న వాహనదారులు ఒక్కసారిగా చిరుతను చూసి ఉలిక్కిపడ్డారు. మరికొందరు ప్రయాణికులు రోడ్డుపై కూర్చున్న చిరుత పులిని వీడియో తీసి సోషల్మీడియాలో పోస్టు చేశారు.
చిరుత సంచారం నేపథ్యం లో స్థానికులు, శ్రీశైలం క్షేత్రానికి వచ్చే భక్తులు భయాందోళనలకు గురవు తున్నారు.శ్రీశైలంలో ఇటీ వల చిరుత సంచారం ఎక్కువైంది.
ఇటీవల ఆర్టీసీ బస్టాండ్, ఏఈవో నివాసానికి సమీపంలో కూడా చిరుత కనిపించిందనే వార్తలు వైరల్గా మారాయి. ఈ క్రమంలో భక్తులతో పాటు స్థానికులు అప్రమత్తంగా ఉండాలని అటవీ శాఖ, దేవస్థానం ఉన్నతాధి కారులు సూచించారు.
స్థానికులు రాత్రి వేళల్లో ఒంటరిగా బయటకు వెళ్లొద్దని సలహానిచ్చారు. మరోవైపు నంద్యాల జిల్లా మహానంది క్షేత్రంలోనూ చిరుత సంచరం కలకలం రేపుతోంది. గాజులపల్లి సమీపంలో స్థానికులకు చిరుత కనిపించింది.
దీంతో వారు వెంటనే పోలీసు సమాచారం అందించారు. దీనిపై అటవీశాఖ అధికారులకు సమాచారం అందించా మని.. అధికారులు బోను ఏర్పాటు చేసే వరకు స్థానికులు, యాత్రికులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఒంటరిగా తిరగవద్దని హెచ్చరించారు.