కాఫీ లోని రసాయనాలు

Chemicals in coffee

Chemicals in coffee

కాఫీ ఆఫీసుల్లోను, రెస్టారెంట్స్లోను, గృహాల్లోను ప్రజల దైనందిన జీవితాల్లో తప్పనిసరి అయినప్పటికీ, కాఫీ తోటల పెంపకం పర్యావరణానికి పెనుప్రమాదం గావించింది. దక్షిణ అమెరికాలో విస్తారంగా రెయిన్ అరణ్యాలు కాఫీ తోటల పెంపకానికి నరికివేయబడ్డాయి. 20వ శతాబ్దంలో కాఫీ తోటలను అధిక సాంద్రతలో విస్తారంగా రసాయనిక ఎరువులనుపయోగించి సాగు చేయడం, తోటలకు నీడకవసరమైన వృక్షాలను నరికివేయడం, తద్వారా నేలకోతకు గురియై భూసారం క్షీణించడం లాంటి దుష్పరిణామాలు చోటు చేసుకున్నాయి.

ప్రస్తుతం వాతావరణ మార్పుల వలన కాఫీ తోటల ఉనికికే ప్రమాదమేర్పడింది. తోటల పెంపకానికి అవసరమైన చల్లని వాతావరణం కనుమరుగయ్యే పరిస్థితులున్నాయి. ఈ పరిస్థితి నుండి బయట పడాలంటే అనుకూల నేల, వాతావరణ పరిస్థితులున్న ప్రాంతాలకు పెంపకాన్ని విస్తరించడం, లేదా తోటలున్న ప్రదేశాల్లోనే అనుకూల పరిస్థితులు కల్పించడం (నీడనిచ్చే వృక్షాల క్రింద పెంచడం, సేంద్రియ ఎరువులను వాడటం, పక్షుల సంచారానికనువైన పద్ధతులు పాటించడం) లాంటివి చేపట్టాలి. ప్రస్తుతం కాఫీ తోటల పెంపకం రైతాంగానికంత లాభసాటిగా లేదు.

కాఫీ గింజలకు గిట్టుబాటు ధరలు కల్పించడం, కాఫీ గింజలను ఇతోధికంగా ఎగుమతి చేయడం, తగు మార్కెట్ సదుపాయం కల్పించడం, ధరలు పడిపోయినపుడు కాఫీ బోర్డు జోక్యం చేసుకోవడం, కోపరేటివ్ సొసైటీలు స్థాపించి వాటి ద్వారా మార్కెటు సదుపాయం కల్పించడం లాంటి క్రియాశీలక కార్యక్రమాలు చేపట్టాలి.

కాఫీలోని రసాయనాలు

కాఫీలో ప్రధానంగా కెఫీన్, టేనిన్, ఫిక్స్డ్ ఆయిల్, పిండిపదార్థాలు, మాంసకృత్తులు ఉంటాయి. కాఫీలో 2-3% కెఫీన్, 3-5% టానిన్స్, 13% మాంసకృత్తులు, 10-15% ఫిక్స్డ్ ఆయిల్స్ ఉంటాయి. కాఫీ గింజల్లో కెఫీన్ క్లోరోజెనిక్ ఆమ్లం రూపంలో ఉంటుంది. 2020లో హేమరాజ్ శర్మ విశ్లేషణ ననుసరించి; వేయించిన కాఫీ గింజల్లో నీటిలో కరిగే చక్కెర సుక్రోజ్, ఫ్రక్టోజ్, గ్లూకోజ్ రూపంలో ఉంటుంది.

Also Read నల్లమల ఫారెస్ట్ లోకి అడవిదున్న రాక

కాఫీ గింజల్లో ల్లో 14% క్లోరోజెనిక్ ఆమ్లం ఉండి కాఫీ సువాసనకు అద్దం పడుతుంది. కెఫీన్ సరాలను ఉత్తేజపరుస్తుంది. రక్తప్రసరణను పెంచుతుంది. శ్వాసను కంట్రోల్ చేస్తుంది. కేఫీన్ కొంచం చేదుగా ఉంటుంది. కాఫీ పానీయంలో 10% కెఫీన్, 6% క్లోరోజెనిక్ ఆమ్లం ఉంటుంది. గింజలను వేయించినపుడు కెఫీన్ తగ్గుతుంది. ప్రజలు కెఫీన్ను కాఫీ, తేయాకు, కోలా రూపంలో త్రాగుతారు. ఇవి ఉత్తేజపరిచే పానీయాలు. కాఫీ మరియు తేయాకు తోటలను శాస్త్రీయంగా పెంచి ఎగుమతి చేసి విదేశీమారక ద్రవ్యం ఆర్జించాలి.

మే నెల 21వ తేదీని ప్రపంచ తేయాకు దినంగా జరుపుకుంటున్నారు. గ్రీన్ టీ వ్యాధి నిరోధక శక్తి పెంచుతుంది. దానికి వైరస్ మరియు బాక్టీరియా ద్వారా సంభవించే వ్యాధుల నుండి రక్షించే లక్షణాలున్నాయి. దీనిలో అధికంగా ఆహార విలువలున్నాయి మిగతా టీలతో పోలిస్తే. ఎందువలనంటే గ్రీన్ టీ ప్రాసెసింగ్ విధానం మిగతా వాటి కన్నా భిన్నంగా ఉంటుంది. తేయాకుపై జరిపిన పరిశోధనా ఫలితాలను బట్టి గ్రీన్ టీ హృదయ సంబంధించిన వ్యాధులను 23% తగ్గిస్తుంది.

గ్రీన్ తేయాకు మధుమేహ వ్యాధిగ్రస్తుల్లో

ఇది విటమిన్-ఇ కన్నా 200 రెట్లు చర్మాన్ని నాశనం చేసే ఫ్రీరాడికల్స్ని తగ్గించే శక్తి గలది. ఇది చెడు కొలెస్టరాల్ని తగ్గిస్తుంది. మంచి కొలెస్టరాల్ను బాగా ఉంచుతుంది. బ్రెస్ట్ కాన్సర్ని తగ్గిస్తుంది. కోలోరెక్టల్ కాన్సర్, ఊపిరితిత్తుల కాన్సర్, ప్రోస్ట్రేట్ కాన్సర్ల బారిన పడే అవకాశాన్ని తగ్గిస్తుంది.

అధిక రక్తపోటును 46-65 శాతం తగ్గిస్తుంది. ఇవేగాక గ్రీన్ తేయాకు మధుమేహ వ్యాధిగ్రస్తుల్లో శరీర మెటబాలిజంను పెంచి ఉపయోగకారిగా ఉంటుంది. క్రొవ్వును తగ్గిస్తుంది. రక్తంలోని గ్లూకోజ్ పరిమాణాలను నియంత్రిస్తుంది.

Also Read..Samsung 163 cm (65 inches) 4K Ultra HD Smart QLED TV

ఇన్ని ఆరోగ్య లాభాలుండటం వలనే 158 మిలియను అమెరికన్లు ప్రతి సంవత్సరం గ్రీన్ టీ త్రాగుతారు. పలురకాల తేయాకుల్లో కెఫిన్ పరిమాణం గమనిస్తే, వైట్ టీలో 6-20మి.గ్రా., గ్రీన్ప్లేలో 15-30మి.గ్రా. బ్లాక్ టీలో 40-60 మి.గ్రా., కాఫీలో 60-135మి.గ్రా. కెఫీన్ ఉంటుంది. విటమిన్ సి గ్రీన్టిలో అత్యధికంగా (250 మి.గ్రా), కౌల్లో (155 మి.గ్రా), కివిలో (110 మి.గ్రా.), ఆరంజ్లో (50మి.గ్రా.) ఉంటుంది

డా॥ చెరుకూరి వీరరాఘవయ్య, విశ్రాంత ప్రధాన శాస్త్రవేత్త,
హైదరాబాద్ : 84413 52640

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

scroll to top