శ్రీశైల భ్రమరాంబ అమ్మవారికి శాకంభరీ ఉత్సవం

Sakambhari festival Srisaila Bhramaramba

Sakambhari festival Srisaila Bhramaramba

ఆషాఢ పౌర్ణమిని పురస్కరించుకొని శ్రీశైల భ్రమరాంబా దేవి అమ్మ వారికి శాకంభరీ ఉత్సవాన్ని నిర్వహించారు.

ఇందుకోసం అవసర మైన సుమారు 4వేల కేజీలకు పైగా వివిధ రకాల ఆకు కూరలు, కూర గాయలను, వివిధ రకాల ఫలాలను తెప్పించడం జరిగింది.

దేవస్థానం సూచనల మేరకు పలువురు దాతలు వీటిని విరాళంగా సమర్పించారు. వంగ, బెండ, దొండ, కాకర, చిక్కుడు, గోరు చిక్కుడు, మునగ,

సొర, బీర, గుమ్మడి, బంగాళ దుంప, కంద దుంప, క్యాప్పికమ్‌ (బెంగుళూరు మిరప), క్యాబెజీ, బీన్స్‌, క్యారెట్‌, అరటి మొదలైన వివిధ రకాల కూరగాయలు,

తోట కూర, పాల కూర, మెంతి కూర, చుక్క కూర, మొదలైన పలురకాల ఆకు కూరలు, పుదిన, కరివేపాకు, కొత్తి మీర లాంటి సుగంధ పత్రాలు, కమల, బత్తాయి,

Also Read..నల్లమల అడవులకు రానున్న గజరాజులు

ద్రాక్ష, ఆపిల్‌, అరటి, ఫైనాపిల్‌ మొదలైన పలు రకాల ఫలాలు, నిమ్మ కాయలు, భాదం కాయలు మొదలైన వాటిని ఈ ఉత్సవానికై తెప్పించారు.

అదే విధంగా ఈ ఉత్సవంలో భాగంగానే శ్రీ భ్రమ రాంబాదేవి వారికి విశేష పూజలు జరిపించ బడ్డాయి. ఈ ఉత్సవంలో శ్రీఅమ్మవారి మూల మూర్తిని..

వివిధ రకల కూర గాయలతోనూ, ఆకు కూరలతోనూ మరియు పలు రకాల ఫలాలతో విశేషంగా అలంకరించి అదే విధంగా అమ్మ వారికి విశేష పూజలు జరిపించారు.

దేవాలయ ప్రాంగణాన్ని కూడా పలు రకాల ఆకు కూరలు, కూర గాయాలతో అలంక రించారు. ఈ ఉత్సవం లో భాగంగానే శ్రీ అమ్మ వారి ఉత్సవ మూర్తికి,

ఆలయ ప్రాంగణం లోని రాజ రాజేశ్వరి దేవికి, సప్త మాతృ కలను, గ్రామ దేవత అంకాళ మ్మకు ప్రత్యేక పూజలు విశేషంగా శాకా లంకరణ చేయ బడింది.

ఈ విధంగా అమ్మ వారిని శాకాల తో అర్చించ డం వలన అతి వృష్టి, అనా వృష్టి నివారించబడి, సకాలంలో తగినంత వర్షాలు కురిసి, పంటలు బాగా పండుతాయని, కరువు కాటకాలు నివారించ బడ తాయిని పురాణాలు చెబుతున్నాయి.

Also Read..YABER PRO V9 WiFi 6 Bluetooth Projector

కాగా పూర్వం హిరణ్యాక్షుని వంశా నికి చెందిన దుర్గ ముడు అనే రాక్షసుడు తన తప శ్శక్తితో వేదాలను అంత ర్జానం చేశాడు.

దాంతో యజ్ఞ యాగా దులు నిలిచిపోయాయి. ఈ కారణంగా కరువు కాటకాలతో తీవ్ర క్షామం ఏర్పడింది. అప్పుడు మహర్షు లందరూ ఆదిపరాశక్తిని గురించి తపస్సు చేశారు. ఆ తపస్సుకు పరాశక్తి ప్రసన్నురాలై లోకరక్షణకోసం దుర్గముడిని సంహరించి, వేదాలను రక్షించి వైదిక కర్మలను పునరుద్ధరింపజేసింది. ఈ సందర్భంలోనే జగన్మాత తన నుండి వివిధ రకాల ఆకుకూరలు, కూరగాయలు ఫలాలు మొదలైన శాకాలను సృష్టించి, క్షామాన్ని నివారించింది. ఆ విధంగా అవతరించిన ఆ పరాశక్తి స్వరూపమే శాకంభరీదేవి. ఈ కారణంగానే ఆషాఢ పౌర్ణమి రోజున అమ్మవారిని శాకాలతో అలంకరించి ఆర్చించే సంప్రదాయం ఏర్పడింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

scroll to top