ఈనెల 28న శ్రీశైలం మల్లన్న ఆలయం మూసివేత

Srisailam-Mallanna-Temple-closed-on-28th.jpg

చంద్రగ్రహణం కారణంగా ఈనెల 28న శ్రీశైలం మల్లన్న ఆలయం మూసివేత

శ్రీశైలం మల్లన్న ఆలయం ఈ నెల 28వ తేదీన పాక్షిక చంద్రగ్రహణం కారణంగా 28 వ తేదీన సాయంత్రం 5 గంటల నుంచి మరుసటి రోజు అనగా 29 న ఉదయం 5 వరకు ఆలయద్వారాలను మూసివేయడం జరుగుతుందని ఆలయ ఈవో పెద్దిరాజు ప్రకటన ద్వారా తెలిపారు అలానే 29 ఉదయం 5 గంటలకు ఆలయద్వారాలు తెరచి ఆలయశుద్ధి. సంప్రోక్షణ, ప్రాతఃకాల పూజల అనంతరం 7 గంటల నుండి భక్తులను దర్శనాలు,ఆర్జిత అభిషేకాలు, ఇతర ఆర్జితసేవలు అనుమతిస్తామన్నారు కాగా చంద్రగ్రహణం రోజైన 28న మధ్యాహ్నం 3,30ల వరకు మాత్రమే భక్తులకు సర్వదర్శనం అనుమతిస్తామని అలానే 28 న మధ్యాహ్నం 12.30 వరకు మాత్రమే గర్భాలయ ఆర్జిత అభిషేకాలకు అవకాశం కల్పిస్తూ సామూహిక అభిషేకాలు,స్పర్శ దర్శనాలు (సర్వ కాదు)కూడా ఉదయం మాత్రమే ఉంటుందన్నారు అలానే రాత్రి జరిగే శ్రీస్వామి అమ్మవార్ల నిత్యకల్యాణం కూడా నిలుపుదల చేయడం జరిగిందన్నారు అలానే ప్రధానాలయంతో పాటు పరివార ఆలయాలు కూడా మూసివేస్తామన్నారు అలానే భక్తులకు ఉచిత అన్నదాన వితరణ కూడా 28 న ఉదయం 10 నుండి మద్యాహ్నం వరకు మాత్రమే ఉంటుందని ఆరోజు రాత్రి పెట్టే అల్పాహారం కూడా నిలుపుదల చేస్తామని భక్తులు విషయాన్ని గమనించాలని భక్తులను ఈవో పెద్దిరాజు కోరారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

scroll to top