గుండ్లకమ్మ నది గిద్దలూరు సమీపాన దిగువమెట్ట నల్లమల అడవుల్లో, ఎతైన కొండచరియల్లో గుండ్లబ్రహ్మేశ్వరం వద్ద పుట్టి ,
గుర్రాలగుండం, ఇసుకగుండం, మారకంబోడు గుండం, సుక్కలగట్టు గుండం,నెమలి గుండం అని మొత్తం ఏడు గుండాలను(జలపాతాలు) గా మారి,
కంబం చెరువులో కలిసి, మార్కాపురం, అద్దంకి మీదుగా 280 కి.మీ పొడవునా ప్రవహించి, ఒంగోలు సమీపాన గుండాయి పాలెం బంగాళాఖాతంలో కలుస్తుంది.
గుండ్లకమ్మ ప్రవహించే మార్కాపురం, పెద్దఆరవీడు, దొనకొండ, త్రిపురాంతకం, కురిచేడు ప్రాంతాలను చరిత్రలో “ఏఱువనాడు” గా వ్యవహరించే వారు.
ఇందులో కొచ్చెర్లకోట అంతర్భాగంగా ఉండేది. కొచ్చెర్లకోటను స్వయంగా శ్రీకృష్ణదేవరాయలు దాడి చేసి జయించాడు.
Also Read నల్లమలకు అనుకోని అతిదిగా అడవి దున్న
కొచ్చెర్లకోట దాటిన తరువాత గుండ్లకమ్మకు ఇరు వైపులా సముద్రం వరకు విస్తరించిన ప్రాంతాన్ని “పూగినాడు” అనేవారు.
అనవేమారెడ్డి మీద దొరికిన శాసనాల ప్రకారం అద్దంకి పూగినాడు రాజధానిగా ఉండేది. “బోయకొట్టములు పండెండ్రు” కథా ప్రాంతం మొత్తం ఈ ఏఱువనాడు మరియు పూగినాడులోనే ఎక్కువ .
గుండ్లకమ్మ తీరం మూడుప్రాంతాల చరిత్ర,సంస్కృతిల సమ్మేళనం. క్రీస్తు పూర్వం 2వ శతాబ్ధం నాటి బౌద్ద స్తూపం చందవరం ,నాలుగవ శతాబ్దంనాటి జైన క్షేత్రం
“దువ్వ సీమ” నేటి శైవక్షేత్రం దూపాడు,6వ శతాభ్దపు పల్లవుల-చాళుక్య జైత్రయాత్రల రహదారి కంచి నుంచి విజయవాడ మధ్య ప్రాంతం,
12వ శతాబ్ధపు పలనాటి బాలచంద్రుడు కంకణాలు కట్టుకున్న “కంకణాల పల్లి” వున్న ప్రాంతం, బ్రహ్మనాయుడు ప్రతిష్టించిన ..
చెన్నకేశవ స్వామి గుడి వున్న మార్కాపురం, కాటమరాజు ఆవులను మేపిన ప్రాంతం, కృష్ణదేవరాయలు స్వయంగా దాడిచేసి గెలిచిన కొచ్చెర్లకోట,
ఆయన శ్రీమతి వరదరాజేశ్వరమ్మ తొవ్వించిన కంబం” చెఱువు & కట్టించిన ఆలాటంకోట, విడిదిచేసిన గుర్రపుశాల, అమానిగుడిపాడు వున్న ప్రాంతం.
వీటన్నిటిని మించి పల్లవుల నుంచి కాకతీయులు, రెడ్డిరాజుల చరిత్రకు సాక్ష్యం చెప్పే “త్రిపురాంతకం” వున్న ప్రాంతం.
Also Read – Sony BRAVIA 3 Series 139 cm (55 inches) 4K Ultra HD Smart LED Google TV K-55S30B (Black)
కృష్ణా తీరంలో లాగానే గుండ్లకమ్మ తీరంలో కూడా భౌద్ధం,శైవం వర్ధిల్లాయి. చంద్రవరం భౌద్ధస్థూపం ప్రసిద్ధి చెందినది.చందవరం దగ్గర వున్న బౌద్దస్తూపం ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళు ఏర్పాటు చేసిన బోర్డు మీద ఈ విధంగా రాశారు,”జీవనది అయిన గుండికా నది(i.e.గుండ్లకమ్మ) ఉత్తర భారతదేశం నుంచి కంచికి వెళ్ళే దారిలో వున్న చందవరం దగ్గర శాతవాహన కాలంలో క్రీ.పూర్వం 2వ శతాభ్దంలో ఈ స్తూపం కట్టారు”,ఇది గుండ్లకమ్మ నది ప్రాముఖ్యతను తెలియచేస్తుంది.
తర్లుబాడు మండలంలో గుండ్లకమ్మ తీరంలో భౌద్ధ ఆనవాళ్లు ఉన్నాయి.
రాష్ట్రంలో నీటి లభ్యత ఆధారంగా చూస్తే గోదావరి, కృష్ణ, తుంగభద్ర,పెన్నా,వంశధార, నాగావళి, ఎర్రవాగు తరువాత గుండ్లకమ్మనే పెద్దనది. సాలీనా 20 టీఎంసీ ల నీరుఈనదిలో లభ్యం అవుతుంది.
ఒంగోలు సమీపంలో మద్దిపాడు వద్ద గుండ్లకమ్మ మీద 3.90టీఎంసీ స్టోరేజితో ప్రాజెక్ట్ ను నిర్మించారు. ఈ ప్రాజెక్ట్ నిర్మాణం జరిగిన స్థలానికి సమీపంలోని దేవాలయంలోనే ఎఱ్ఱాప్రగడ మహాభారతాన్ని రచించారు.