• చరిత్రలో మరచిపోలేని నాయకు భారత రత్న మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజపేయి.
  • సిద్ధాంతాలు…విలువలతో రాజకీయం చేసిన మహనీయుడు.
  • ప్రపంచదేశాలకు దీటుగా,భారత దేశం అభివృద్ధి కి పాటుపడ్డారు.
  • సంక్షేమం, అభివృద్ధి కి కృషిచేశారు.
  • రహదారులు, ఐటి,పారిశ్రామిక అభివృద్ధికి తోడ్పాటు అందించారు.

నంద్యాల డిసెంబర్ 13
ప్రపంచదేశాలకు దీటుగా భారతదేశం అభివృద్ధికి పాటుపడి చరిత్రలో మరచిపోలేని నాయకులు భారత రత్న మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజపేయి అని వైద్య ఆరోగ్యశాఖ మాత్యులు సత్యకుమార్ యాదవ్ అభివర్ణించారు.అటల్ బిహారీ వాజపేయి శతజయంతి నీ పురస్కరించుకొని రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా ల్లో ఆయన విగ్రహ ప్రతిష్ఠ నంద్యాలలో ఏర్పాటు చేస్తున్న సందర్భంగా నంద్యాల జిల్లా బిజెపి అధ్యక్షులు అభిరుచి మధు ఆధ్వర్యంలో రాష్ట్ర బిజెపి అధ్యక్షులు పి.వి. ఎన్ మాధవ్ నేతృత్వంలో చేపట్టిన కార్యక్రమానికి రాష్ట్ర మంత్రులు బిసి జనార్ధన్ రెడ్డి, ఎన్.ఎం.డి.ఫరూక్,సత్యకుమార్ యాదవ్ ముఖ్య అతిధులుగా హాజరయ్యారు.మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజపేయి విగ్రహ ప్రతిష్ఠ అనంతరం బహిరంగ సభలో మంత్రి సత్యకుమార్ యాదవ్ మాట్లాడుతూ భారతరత్న మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజపేయి చరిత్రలో మరచిపోలేని నాయకులన్నారు.సిద్ధాంతాలు,విలువలతో రాజకీయం చేసిన మహనీయుడన్నారు.ప్రపంచదేశాలకు దీటుగా భారత దేశం అభివృద్ధి చెందాలని ఆ దిశగా కృషిచేశారన్నారు.సంక్షేమం,అభివృద్ధికి పెద్ద పీట వేశారన్నారు.రహదారులు, ఐటి,పారిశ్రామిక,విద్యా,వైద్యం,ఉద్యోగ అవకాశాలపై ప్రత్యేక దృష్టి సారించి మార్గదర్శకుడయ్యారన్నారు. వాజపేయి పాలనలో ప్రతిపాదించిన సుపరిపాలన,జాతీయ ఐక్యత,సమగ్ర అభివృద్ధి విధానాలు దేశానికి కొత్త దిశ చూపించాయన్నారు.దేశం ముందుకు ఎలా వెళ్లాలి అని దూరదృష్టిని నిర్దేశించారన్నారు.వాజపేయి ఆశయాలను ప్రధాని నరేంద్ర మోదీ కొనసాగిస్తూ పథకాలను మరింత విస్తరింపజేస్తున్నారని పేర్కొన్నారు. బిజెపి ప్రభుత్వం 11 ఏళ్లలో ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమం,అభివృద్ధితో 25 మంది ప్రజలు పేదరికం నుంచి బయటపడ్డారన్నారు.వాజపేయి,మోదీ నాయకత్వాలు అందించిన అభివృద్ధితో ప్రపంచంలో అతి పెద్ద ఆర్థిక వ్యవస్త లో 10 వ స్థానంలో ఉన్న భారతదేశం 4 వ స్థానంకు చేరే విధంగా చేశారన్నారు.సాధారణ కుటుంబంలో జన్మించి సిద్ధాంతాలు ,విలువలతో కూడిన రాజకీయాలు చేశారన్నారు.10 సార్లు లోక సభ,2 సార్లు రాజ్యసభకు ఎన్నికై హుందాగా రాజకీయాలు చేశారన్నారు.విద్యార్థి దశ నుంచే రాజకీయాలు చేసి 70 ఏళ్ల వరకు రాజకీయాల్లో ప్రజాసేవ చేశారన్నారు.దేశంలోని రైతులకు,వ్యవసాయం,శాంతి భద్రతలు,అక్కా చెల్లెళ్ల బాగోగులు,నిరుద్యోగ సమస్య పై నిరంతర శ్రామికుడిగా పనిచేశారన్నారు.దేశంలో 12 సార్లు లోక సభ,రాజ్య సభ తో పాటు మూడు సార్లు ప్రధానిగా చేసి మచ్చలేని నాయకుడుగా రాజకీయాల్లో పేరు తెచ్చుకున్నారన్నారు.నమ్ముకున్న సిద్ధాంతాలకు రాజి పడకుండా,ప్రతి పక్షాలను మాటల అంకుశంతో పొడుస్తూ అజాత శత్రువుగా పేరు తెచ్చుకున్న నాయకుడు అన్నారు.ప్రపంచదేశాల అజమాయిషీ తల వంచక వారి తోక కత్తెరించడంలో ఆయనకు ఆయనే సాటి అని నిరూపించుకున్నారన్నారు.దేశ ప్రయోజనాలకోసం నేను కూలిపోతాను కానీ తల వాంఛను అని అమెరికాకు హెచ్చరికలు చేశారన్నారు.కళాత్మక భావాలు ఉన్నవారు కావడంతో అపజయాన్ని ఒప్పుకోను,కాలం గీసిన గీతను చెరిపేసే విధంగా ప్రణాళికలు రూపొందించారు.రైతులు పండించిన పంటలు తీసుకొని పోవడానికి దారిన రోడ్డు మార్గాలు లేకపోవడంతో దేశ వ్యాప్తంగా గ్రామీణ రోడ్ల ను 60 వేల కోట్లతో అభివృద్ధి చేశారన్నారు.పనికి ఆహార పథకం కింద వ్యవసాయ కూలీలకు కనీస వేతనం కింద అప్పట్లోనే 70 నుంచి 80 వేలకోట్లు విడుదలచేశారని గుర్తుచేశారు.వాజపేయి అనుసరించిన విధానాలను మోదీ హయంలో 86 వేల కోట్లు విడుదల చేశారన్నారు.రైతులకు పంట భీమా పథకాన్ని ఏర్పాటు చేసి లక్షా,75 వేల కోట్లు రైతుల ఖాతాల్లో వేశారన్నారు.దేశంలో ప్రతి ఒక్కరు విద్యను అభ్యసించేవిడంగా కళాశాలలు, యూనివర్సిటీ లు, ఐ ఐ టి నూతన విద్యా విధానాన్ని అమలులోకి తీసుకొని రావడంతో ఎందరో విద్యావంతులు అయ్యారన్నారు.సంపద సృష్టించడం డబ్బు ప్రామాణికం కాదని అభివృద్ధితోవాంపడ సృష్టించవచ్చని నిరూపించారన్నారు.దేశ వ్యాప్తంగా 58 వేల కోట్లతో హైవే లు 111 లక్షల కోట్లతో మౌలికసదుపాయాలు కల్పించారన్నారు.మోదీ ఆశయాలకు అనుగుణంగా కూటమి పాలనలో ముఖ్య మంత్రి నారా చంద్ర బాబు,ఉపముఖ్య మంత్రి పవన్ కళ్యాణ్ నాయకత్వంలో 65 వేల కోట్లతో అభివృద్ధి శ్రీకారం చుట్టారన్నారు.అమరావతి,బెంగళూరు హైవే నిర్మాణం సాగుతుందన్నారు.ల్యాండ్ లైన్ సేవల నుంచి సెల్ ఫోన్ సేవలకు అంకురార్పణ చేశారన్నారు. అయిదు ఏళ్లలో 27 దేశాలు లుకలుకలు లేకుండా చేశారన్నారు.పాకిస్తాన్ తో స్నేహహస్తం కోసం లాహోర్ బస్సును ఏర్పాటు చేసి కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు బస్సు యాత్ర చేశారన్నారు.పాకిస్తాన్ బుద్ధి మారకపోవడంతో కార్గిల్ యుద్ధంలో భారత దేశం సత్తా చాటుకునేలా చేశారన్నారు.పాకిస్తాన్ భారత దేశం తో మిత్రత్వం కంటే మీ దేశంలో మీ ప్రభుత్వాన్ని ప్రజలు చి కొడుతున్నారని హిత బోధ చేసినా బర్ఫీ మారలేదన్నారు.పాకిస్తాన్ ఎన్నో ఉగ్రదాడి లు చేసినా భారత్ సర్జికల్ స్ట్రెయిట్,ఆపరేషన్ సిందూర్ తో ప్రజలకు ఇబ్బందులు లేకుండా ఉగ్రవాదుల స్థావరాలు,ఎయిర్ బేస్ లు నాశనం చేశారన్నారు.వందేమాతరం,బుల్లెట్ ట్రైన్లు బిజెపి ప్రభుత్వ హయంలో రూపుదిద్దుకున్నాయని అన్నారు.అప్పటి ప్రధాని పి వి నరసింహారావు హయంలో నంద్యాల ఎర్రగుంట్ల రైల్వే పనులకు 900 కోట్లతో పూర్తి చేశారన్నారు.రాక్షస పాలన నుంచి బయట పడ్డాం,కూటమి పాలనలో ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు నెరవేరుస్తున్నామని అన్నారు.మహిళల ఉచిత బస్సు ప్రయాణాన్ని ఉద్దేశించి సీరియళ్ళ ప్రస్తావన తీసుకొచ్చి అందరిని నవ్వులతో ముంచెత్తారు.మంత్రి బీసీ జనార్ధన్ రెడ్డి మాట్లాడుతూ సత్త జయంతి సందర్భంగా మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజపేయి విగ్రహ ప్రతిష్ఠకు రావడం పూర్వ జన్మ సుకృతం అని అన్నారు.ప్రధాని గా మూడు సార్లు పదవులు పొంది భారత దేశం అభివృద్ధికి కృషి చేశారన్నారు.సింగపూరు,దుబాయ్ తరహాలో ఆంధ్ర ప్రదేశ్ లో రహదారుల నిర్మాణాలకు లక్ష కోట్ల పనులు జరుగుతున్నాయన్నారు.రాష్ట్ర అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అహర్నిశలు కష్టపడుతున్నారు.వైసిపి ప్రభుత్వంలో వెనిక్కి పోయిన పరిశ్రమలు వస్తున్నాయన్నారు.మంత్రి నారా లోకేష్ పరిశ్రమలు వచ్చేందుకు కృషి చేస్తూ లక్షల కోట్లు తో పరిశ్రమలు ఏర్పాటు చేస్తూ నిరుద్యోగ సమస్య కు పరిష్కారం చూపుతున్నారన్నారు.మంత్రి ఎన్.ఏం.డి.ఫరూక్ మాట్లాడుతూ నంద్యాల జిల్లా బిజెపి అధ్యక్షులు మధు అంటే తెలియదు కానీ అభిరుచి మధు అంటే ఒక బ్రాండ్ స్థాయికి ఎదిగారన్నారు.అభిరుచి మధు కు నా పై ప్రత్యేక అభిమానమన్నారు.మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజపేయి,ప్రధాని నరేంద్ర మోదీ తో ఉన్న సన్నిహితాన్ని వివరిస్తూ గతంలో ప్రధానిగా వాజపేయి పనిచేస్తున్న సమయంలో మైనార్టీలు హజ్ యాత్ర,మక్కా కు వెళ్లేందుకు విమాన ప్రయాణం కష్టంగా మారిందన్నారు.సీఎం నన్ను ప్రధాని వద్దకు వెళ్లి హజ్ యాత్ర కు అనుమతులు తీసుకొని రావాలని చెప్పడంతో అక్కడ ప్రధాని తో కలిసి కేవలం అయిదు నిమిషాల్లో హజ్,మక్కా కు హైదరాబాద్ నుంచి మక్కా కు విమాన యానా సౌకర్యం డైరెక్ట్ గా ఉండే సౌకర్యం కల్పించారని గుర్తుచేశారు.హైదరాబాద్ లో హి టెక్ సిటీ నిర్మాణానికి ప్రధాని అటల్ బిహారీ వాజపేయి సహకరించడంతో అప్పటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అభివృద్ధి చేశారన్నారు.హైదరాబాద్ లో ఎయిర్ పోర్ట్ నిర్మాణానికి 6 వేల ఎకరాలు భూమి కి అనుమతులు ఇచ్చారన్నారు.కార్గిల్ యుద్ధం విజయవంతం కావడానికి సహకరించారన్నారు.కూటమి ప్రభుత్వం,మోదీ సహాయ సహకారాలతో రాష్ట్రం అభివృద్ధి చెందుతుందన్నారు. బిజెపి రాష్ట్ర అధ్యక్షులు పి.వి. ఎన్.మాధవ్ మాట్లాడుతూ మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజపేయి వ్యక్తిత్వం అందరిని కలుపుకొని పోయేవారు అన్నారు.పార్లమెంట్ పై దాడి జరిగిన సమయంలో 8 మంది జవాన్లు వీర మరణం పొందారన్నారు.పార్లమెంట్ పై దాడిని వాజపేయి సీరియస్ గా తీసుకుని పాకిస్తాన్ హస్తం ఉండడంతో సైన్యం కు పూర్తి ఆదేశాలు ఇచ్చి దాదాపు 100 మంది ఉగ్రవాదులను జైల్లో పెట్టించారన్నారు.భారతదేశంపై కక్ష కాకుండా ప్రేమ పెంచుకోవాలని ఎన్ని సార్లు ప్రయత్నించినా పాకిస్తాన్ వక్ర బుద్ధి మారకపోవడంతో కార్గిల్ యుద్ధం గట్టి గుణపాఠం ఇచ్చిందన్నారు.ప్రపంచదేశాలు భారత వైపు కన్నెత్తి చూడకుండా మోదీ పాలనలో దీటైన జవాబు ఇస్తున్నారన్నారు.భారత స్వతంత్రం వచ్చిన తర్వాత భారత దేశం మట్టి గడ్డ కాదని పార్లమెంట్ లో మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజపేయి చేసిన ప్రసంగం అందరినీ మంత్రం ముగ్గులు చేసిందన్నారు.భారతదేశ అభివృద్ధి చెందాలని విదేశీ వస్తువులు వద్దు,స్వదేశీ వస్తువులు వదలి అనే నినాదం తీసుకొచ్చారన్నారు.స్వచ్ఛ భారత్ తో దేశం వికసిత్ భారత్ తో పాటు వికసిత్ ఆంధ్రప్రదేశ్ గా మారాలన్నారు.మాజీ ఎమ్మెల్యే భూమా బ్రహ్మానందరెడ్డి మాట్లాడుతూ రాయలసీమ నుంచే ప్రారంభించడం గర్వకారణం అన్నారు.మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజపేయి దూరదృష్టితో హైవే లు ఏర్పాటుచేయడంతో దేశం రూపురేఖలు మారిపోయాయన్నారు.కూటమి ప్రభుత్వానికి, బీజేపీ ప్రభుత్వం అన్ని విధాలుగా సహకారం అందించడం వల్ల రాష్ట్రం అభివృద్ధి దిశగా పయనిస్తుందని అన్నారు.రవాణా వ్యవస్త దారుణంగా ఉండేదని హైవే ల నిర్మాణంతో అన్ని రంగాలు అభివృద్ధి చెందుతున్నాయన్నారు.ప్రపంచదేశాలకు బయటపడకుండా ధైర్యంగా నిలబడ్డారని కొనియాడారు.ప్రజలు,ప్రతిపక్షాలు మెచ్చుకునే నాయకుడు అని అన్నారు.నంద్యాల జిల్లా బిజెపి అధ్యక్షులు అభిరుచి మధు మాట్లాడుతూ బిజెపి పార్టీ నాయకులకు రాయలసీమ అంటే ప్రాణమన్నారు.రాయలసీమ నుంచే అన్ని కార్యక్రమాలు మొదలు కావడం సంతోషం అన్నారు.మహా నాయకులు ప్రపంచంలో వెలుగులోకి తీసుకొని రావాలని ,నేటి యువతకు తెలిసే విధంగా బిజెపి,కూటమి ప్రభుత్వం ఆలోచించి రాష్ట్రం లోని అన్ని జిల్లా కేంద్రాల్లో మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజపేయి విగ్రహ ప్రతిష్ఠ నిర్వహిస్తున్నారన్నారు. బిజెపి రాష్ట్ర అధ్యక్షులు మాధవ్ వచ్చిన తర్వాత ప్రతి కార్య కర్తకు న్యాయం జరుగుతుందన్నారు.రాష్ట్రంలో అన్ని వర్గాలు ఆశిస్తున్న విధంగా సముచిత స్థానం అందిస్తున్నారని అన్నారు.కూటమి నాయకులం అందరం కలసి కట్టుగా రాష్ట్ర అభివృద్ధికి పాటు పడతామన్నారు.ఈ కార్యక్రమంలో జిల్లాలోని బిజెపి,జన సేన,తెలుగు దేశం నాయకులు హాజరయ్యారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

scroll to top