- నాలుగు నెలలుగా జీతాలు విడుదల చేయని కూటమి ప్రభుత్వం
- అర్ధాకలితో అలమటిస్తూ సేవలందిస్తున్న వైనం
- నిర్వహణ లేక తుప్పుపట్టిపోతున్న 108 వాహనాలు
కుయ్.. కుయ్ అంటూ ప్రజల ప్రాణాలను రక్షించేందుకు మెరుపు వేగంతో సాగే ఆపద్బాంధవులనే కుయ్యో.. మొర్రో అంటూ మొత్తుకునేలా చేసింది కూటమి ప్రభుత్వం. వాహనాలే కాదు, అందులో పనిచేసే సిబ్బందినీ పక్కన పెట్టేసింది. జీతాలు లేక జీవి తాలు రోడ్డున పడుతున్నాయి. పసివాళ్లు మొదలు పెద్దల వరకు ఆకలి కేకలు వేస్తుంటే తమ వారిని తలచుకుని 108 ఉద్యోగి గుండె బరువుతో జీవచ్ఛవమైపోతున్నాడు. చేసేది లేక పంటి కిందే పుట్టెడు బాధను బిగపట్టి విధి నిర్వహణకు పయనమవుతున్నాడు. తిండి లేక చేయి చాస్తుంటే అప్పు కూడా పుట్టడం లేదు. ఎప్పుడు తిరిగిస్తావని అడిగితే తేదీని చెప్పలేక తడబడుతున్న దైన్యం. ఇది రాష్ట్రంలో 108 సిబ్బంది ప్రస్తుత పరిస్థితి
నంద్యాల జిల్లా, నందికొట్కూరు : రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్ప డినప్పటి నుంచి 108 సిబ్బంది జీవితాలు దుర్భరంగా మారాయి. నాటి నుంచి ఇప్పటి వరకు ఒక్క నెల జీతమైనా రాలేదు. జూన్ నెలలో కూటమి ప్రభుత్వం కొలువుదీరితే జూలై, ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ జీతాలు ఇప్పటికీ జమచేయలేదు.
శిథిలావస్థలో వాహనాలు ; నంద్యాల జిల్లాలో 108 అంబులెన్స్ వాహనాలు 27 సేవలందిస్తున్నాయి. వీటిలో ప్రతి వాహనం లక్షరు పైగా కిలోమీటర్లు తిరిగినవే. ఇవన్నీ కాలం చెల్లిన స్థితికి చేరుకున్నాయి. పల్లెటూళ్లు, మండల ప్రాం తాల్లో సేవలందించే వాహనాలు మరింత ఆధ్వానం గా మారాయి. జీతాలు అందకపోయినా సిబ్బందే నానా యాతనలు పడి వాటికి మరమ్మతులు చేయిస్తున్నారు. మరి వాటి బిల్లుల సంగతి ఏమిటో దేవుడికే ఎరుక.
also read జూనియర్ ఎన్ టి ఆర్ బామ్మర్ది నార్నే నితిన్ ఎంగేజ్మెంట్
ఉద్యోగులా? బానిసలా?
108 సిబ్బంది విధుల నిర్వహణ తీరు బానిసలను తలపిస్తోంది. సిబ్బంది రోజులో 12 గంటలు పనిచే యాలి. వారంలో చేసే 24 గంటల అదనపు పనికి ఎటువంటి చెల్లింపూ ఉండదు. అంతే కాదు.. వారికి ఉద్యోగ భద్రత లేకపోవడం మరింత శోచనీయం. వీరు స్కీంలో భాగంగా అరబిందో సంస్థ ఉద్యోగులు గానే పరిగణించబడతారు. 108 సేవలను నిర్వహి స్తున్న ప్రతి ఉద్యోగికి పీఎఫ్ సౌకర్యం ఉంటుంది. అయితే ఉద్యోగి, యాజమాన్యం భాగస్వామ్యం రెం డూ వారి జీతాల నుంచే జమ అవుతాయి. సిబ్బందికొరత జిల్లా 108 విభాగాన్ని తీవ్రంగా వేధిస్తోంది. 150 మందికి గాను 133 మంది ఉద్యోగులే ఉన్నారు. వీరిలో పైలెట్లు 67 మంది కాగా, ఎమర్జెన్నీ మెడికల్ టెక్నీషియన్లు 66 మంది ఉన్నారు. ఒక్కో వాహనానికి కనీసం ఐదుగురు ఉద్యోగులు రెండు షిప్టుల్లో పనిదే యాల్సి ఉన్నా, ఆ ఊసే లేదు. వీరిలో ఏ ఉద్యోగికి వారాంతపు సెలవులు లేవు. పండగ పబ్బాలేమీ ఉం డవు. ఎప్పుడు డ్యూటీ వేస్తే అప్పుడు చేయాల్సిందే. ఇంతటి ప్రయాసలో సిబ్బంది ఉన్నా ఇంక్రిమెంట్ల ఊసే లేదు. గత ‘ప్రభుత్వ హయంలో జీతాల చెల్లింపు నుంచి వాహనాల నిర్వహణ పకడ్బందీగా సాగేది. కానీ కూటమి ప్రభుత్వం గద్దెనెక్కాక వారి జీవితాలు దుర్భరమయ్యాయి.
ప్రజలకు ప్రాణ సంకటం ; ఉరుము ఉరిమి మంగళం మీద పడినట్లు 108 సిబ్బందికి వేతనాలు ఇవ్వకుండా వేధింపులకు గురిచేస్తుంటే ఆ ప్రభావం ప్రజల మీద పడుతోంది. ప్రభుత్వం కక్ష సాధింపు చర్యల్లో భాగంగా అరబిం దో సంస్థకు బిల్లుల చెల్లింపు మానేసిందని, అందుకే వారు 108 సిబ్బందికి జీతాలు చెల్లించలేకపోతు న్నారని ప్రచారం ఉంది. సంస్థకు ప్రభుత్వం బిల్లులు చెల్లించకపోవడం, సంస్థ సిబ్బందికి చేత నాలు ఇవ్వలేకపోవడం, పాడుబడ్డ వాహనాలు వినియోగిస్తుండడం, సిబ్బంది కొరత, ఈ కారణా లతో వాహనాలు సకాలంలో ప్రమాద స్థలికి చేరుకో లేకపోతున్నాయి. ఇవన్నీ ప్రజల పాలిట ప్రాణ సం కటంగా పరిణమిస్తున్నాయి.
Also Read అత్తగారింటికి పోవడానికి ఆర్టీసీ బస్సు చోరీ..
గోల్డెన్ అవర్ కాన్సెప్ట్కు తూట్లు ; ప్రమాదం జరిగిన వ్యక్తిని గంటలోపు ఆసుపత్రికి చేర్చి వైద్యం అందిస్తే బతికే అవకాశాలు 80 శాతం ఉంటాయన్నది గోల్డెన్ అవర్ కాన్సెప్ట్, స్వతహాగా వైద్యుడైన దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి ఈ పరిస్థితిని ఆకళింపు చేసుకుని 108 సేవలను తీసుకొచ్చారు. ఆయన ఆశయం సత్ఫలితాలిచ్చి నాటి నుంచి నేటి వరకు కొన్ని లక్షల ప్రాణాలు నిలి చాయి. అయితే ఆయన ఆదర్శానికి నేటి కూటమి ప్రభుత్వం తూట్లు పొడుస్తోంది. మెరుపు వేగంతో దూసుకురావడానికి 108 వాహనాలు మునుపటి కండీషన్లో లేవు. ప్రాణాలు నిలిపే వాహనాలు చాలా వరకు శిథి లావస్థకు చేరాయి.
నిరసన బాట
ఇన్ని వ్యయప్రయాసల మధ్య 108 సిబ్బంది. నిరసన బాట పట్టక తప్పని స్థితి అని వార్యమైంది. వస్తులుంటూ పనిచేస్తున్నా కూడా ప్రభుత్వ పెద్దల మనస్సు కరగడం లేదు. దీంతో సీఐటీయూ ఆను బంధ 108 ఉద్యోగుల సంఘం దశల వారీ నిరస సకు పిలుపునిచ్చింది. ముందుగా జిల్లా అదికారు లకు, అరబిందో సంస్థకు, ఎన్టీఆర్ ట్రస్టు వినతి పత్రాలు అందజేసి సమస్యను పరిష్కరించాలని కోరారు. సంబంధిత ప్రభుత్వ శాఖల అధికారులకు మెయిల్ ద్వారా తమ సమస్యలు వెల్లడించారు.