శ్రీశైలం నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీకి, బుడ్డా రాజశేఖర్ రెడ్డి కి వరుస షాక్ లతో బెంబేలిస్తున్న ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి,
నేడు23-02-2024 మహానంది గ్రామానికి చెందిన 100 కుటుంబాలు ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి గారి సమక్షంలో వైస్సార్సీపీలో చేరారు వారందరికీ ఎమ్మెల్యే గారు పార్టీ కండువా వేసి పార్టీ లోకి సాదరంగా ఆహ్వానించి వైస్సార్సీపీ కోసం ఉత్సాహంతో పనిచేయాలని గ్రామ అభివృద్ధి కోసం, నాయకులు, కార్యకర్తల కొరకు ఎప్పుడైనా, ఎక్కడైనా ఏ అవసరం వచ్చినా అండగా ఉంటానని పార్టీలో చేరిన వారికి ఎమ్మెల్యే శిల్పా భరోసా కల్పించారు, పార్టీ చేరిన వారు శిల్పన్న కోసం సిద్ధం అంటూ పిడికిలి బిగించి జయహో శిల్పా జై జగన్ అంటూ నినాదాలు ఇచ్చారు,
ఆత్మకూరు, శ్రీశైలం, వెలుగోడు, బండి ఆత్మకూరు, మహానంది శ్రీశైలం నియోజకవర్గంలో మండలం ఏదైనా, గ్రామం ఏదైనా వైస్సార్సీపీ లోకి వలసలు మాత్రం ఆగడం లేదు టీడీపి స్థానిక నాయకత్వం వలసలను నిలువరించాలని తీవ్ర ప్రయత్నంలో విఫలం అవుతూ తలలు పట్టుకుంటున్నారు,
శ్రీశైలం నియోజకవర్గంలో అతంత మాత్రమే ఉన్న తెలుగుదేశం క్యాడర్ ను కూడా ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి వదలడం లేదు, టీడీపి క్యాడర్ లను వైస్సార్సీపీ లోకి ఆహ్వానిస్తూ రోజు, రోజుకి టీడీపి ని కనుమరుగు చేస్తూ ప్రత్యర్థుల ఆలోచనలకు, ఊహలకు సైతం అందకుండా ఎమ్మెల్యే శిల్పా చావు దెబ్బ కొడుతున్నాడు,
2019 ఎన్నికల్లో 40 వేల మెజారిటీ ఓట్లు సాధించిన ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి గారు రాబోయే 2024 స్వారత్రిక ఎన్నికల్లో 50 వేలు మెజారిటీ సాధించాలనే లక్ష్యంగా పరుగులు పెడుతున్నాడు,
శ్రీశైలం నియోజకవర్గంలో వైస్సార్సీపీ లోకి టీడీపి నుండి రోజు, రోజుకి పెరుగుతున్న వలసలను పరిశీలిస్తున్న టీడీపి అధిష్టానం శ్రీశైలం సీట్ ఆశలు ఇక వదులుకున్నట్టే అని సమాచారం.